• 2 months ago
Landslides On Tirumala Ghat Road Due To Heavy Rains : వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలుకు తిరుపతిలోని పలు లోతట్టు రోడ్లు జలమయం అయ్యాయి. నగరంలోని వెస్ట్‌చర్చి వద్ద ఉన్న అండర్‌ బ్రిడ్జి వద్ద నీరు ప్రవహిస్తోంది. కపిల తీర్థంలోని మాల్వాడి గుండం నుంచి వరద నీరు తిరుపతి నగరంలోకి చేరుతోంది. గొల్లవానిగుంట, పూలవాని గుంట, సంజయ్‌నగర్‌ కాలనీ, సుబ్బారెడ్డి నగర్‌, ఆటోనగర్‌ ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉంది. తిరుపతి నగరంతోపాటు జిల్లాలోని స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉన్నామని అధికారులు తెలిపారు. దొరవారిసత్రం మండలంలో 11.2 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. ఏర్పేడు మండలంలోని గుడిమల్లం వద్ద విద్యుత్ స్తంభం నేలకొరిగింది.

Category

🗞
News
Transcript
00:00🎵outro music plays🎵
00:30🎵outro music plays🎵
01:00🎵outro music plays🎵

Recommended