HELICOPTER SHOWERED FLOWERS: అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వడ్డేపాళ్యం గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్ణాటక చిత్రదుర్గం జిల్లాకు చెందిన చెల్లికెర ఎమ్మెల్యే రమణమూర్తి హెలికాప్టర్ ద్వారా రథోత్సవంపై పూల వర్షం కురిపించారు. రథోత్సవానికి మండలంతో పాటు కర్ణాటకలోని తుముకూరు, చిత్రదుర్గం, మైసూరు, బెంగళూరు, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు.
Category
🗞
News