BSF Police Seize Dumps Set Up By Maoists at Four Places in AOB : ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టులకు పెద్ద షాక్ తగిలింది. మావోయిస్టులు నాలుగు చోట్ల అమర్చిన డంప్‌లను బీఎస్ఎఫ్ పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఏవోబీలో మల్కన్‌గిరి జిల్లా పొడియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో బీఎస్ఎఫ్కు చెందిన రెండో బెటాలియన్ పోలీసులు గాలింపు చర్యలకు వెళ్లారు. వీరికి గురువారం సాయంత్రం నాలుగు చోట్ల అమర్చిన డంప్‌లు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌లలో 5 కిలోల బరువైన ప్రెషర్ బాంబు, 5 టిఫిన్ ఐఈడీ బాంబులు, మూడు ఎలక్రిక్ డిటోనేటర్లు, ఎలక్ర్టికల్ వైర్, రెండు ఎస్‌ఎంబీఎల్ తుపాకీలు స్వా ధీనం చేసుకున్నట్లు మల్కన్‌గిరి జిల్లా పోలీసు కార్యాలయం ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న బాంబ్లను సంఘటనా స్థలంలో నిర్వీర్యం చేసినట్లు పోలీసులు తెలిపారు.
Category
🗞
NewsTranscript
00:00🎵Heroic Music🎵
00:30🎵Heroic Music Continues🎵
01:00🎵Heroic Music Continues🎵