• 7 years ago
Ram Gopal Varma on Saturday appeared before Hyderabad police in connection with a case of obscenity booked against him for his film GST, and also for insulting the modesty of a woman.

జీఎస్టీ నిర్మాణ వ్యవహారంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు సీసీఎస్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. తాను స్కైప్ ద్వారా ఈ సినిమాను విదేశాల్లో నిర్మించారని చెప్పిన వర్మ మాటల్లో వాస్తవం లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో ఆయన వివరణ తమను తప్పుదారి పట్టించేలా ఉందని ఓ అంచనాకు వచ్చిన పోలీసులు అరెస్టు చేసేందుకు తగిన చర్యలు తీసుకొంటున్నట్టు ప్రముఖ దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
వెబ్ డాక్యుమెంటరీ గాడ్‌ సెక్స్‌ ట్రూత్‌ (జీఎస్టీ) వివాదంపై ఇప్పటికే రాంగోపాల్ వర్మను పోలీసులు విచారించారు. గత శనివారం మూడున్నర గంటల పాటు కొనసాగిన విచారణలో వర్మ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. జీఎస్టీ వెబ్ డాక్యుమెంటరీని స్వదేశంలో తీయలేదని పోలెండ్‌లో చిత్రీకరించానని,అది కూడా స్కైప్‌ ద్వారా వీడియోను చిత్రీకరించానని విచారణలో వర్మ చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.
విచారణ అనంతరం వర్మ ట్విట్టర్‌‌లో చేసిన వ్యాఖ్యలను కూడా పోలీసులు తీవ్రంగా భావిస్తున్నట్టు సమాచారం.
జీఎస్టీ కేసు విషయంలో వర్మను మరోసారి సీసీఎస్ పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది. వర్మ వెల్లడించిన విషయాలపై ఇంకా అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేసుకోవడానికి రెండోసారి విచారిస్తాం అని పోలీసులు పేర్కొన్నట్టు తెలుస్తుంది
విదేశాల్లో చిత్రీకరించారంటున్న జీఎస్టీని స్వదేశంలో డౌన్‌లోడ్‌ చేసుకొన్నారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చినట్టు సమాచారం. అదే జీఎస్టీని తిరిగి ఇండియా నుంచే అప్‌లోడ్‌ చేసిన విషయంలో వర్మ దొరికిపోయినట్టు దినపత్రిక వెలువరించిన కథనంలో పేర్కొన్నారు.

Recommended