• 2 days ago
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయ్. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వైభవం చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు
భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రి శోభతో వెలిగిపోతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19న ప్రారంభమైన బ్రహ్మోత్సాలు కన్నులపండువగా సాగుతున్నాయి. 
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 20 గురువారం రోజు ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం తరపున అధికారులు పట్టువస్త్రాలను సమర్పించారు. ఫిబ్రవరి 21 శుక్రవారం సాయంత్రం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవస్థానం తరుపున అధికారులు పట్టువస్త్రాలు  సమర్పించనున్నారు. 

Category

🗞
News

Recommended