CM Revanth Visit SLBC Tunnel Collapse Site : ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద కొనసాగుతున్న సహాయక పనులను మంత్రుల బృందంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. రక్షణ చర్యలకు సంబంధించి బృందాలను సీఎం ఆరా తీశారు. సహాయక చర్యలను సీఎంకు రెస్క్యూ టీమ్ అధికారులు వివరించారు. కాసేపు సొరంగ మార్గంలో పనులను పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి బయటకు వచ్చి సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. సొరంగంలో చేపట్టిన సహాయక చర్యలకు సంబంధించి సీఎం, మంత్రులకు వివరించారు.
Category
🗞
News