Skip to playerSkip to main contentSkip to footer
  • 3/11/2025
SLBC Tunnel Accident Update : ఎల్​ఎల్​బీసీ సొరంగ మార్గంలో ప్రమాదవశాత్తు చిక్కుకుని ఇప్పటికీ ఆచూకీ తెలియని ఏడుగురి కోసం అన్వేషణ కొనసాగుతోంది. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన రెండు ప్రదేశాలను సిబ్బంది విస్తృతంగా తవ్వుతున్నారు. గల్లంతైన వారి జాడ కోసం శోధిస్తున్నారు. టీఎంబీ ముందు భాగానికి చేరుకునేందుకు, ఏడుగురి జాడ కనిపెట్టేందుకు రోబోలును సైతం రంగంలోకి దించారు. రోబోతో రోబోటిక్స్​ బృందం సొరంగంలోకి వెళ్లింది. మొదటి షిఫ్ట్​లో సొరంగంలోకి 110 మంది రెస్క్యూ టీం వెళ్లింది. సొరంగం పైకప్పు కుప్పుకూలే అవకాశం ఉన్న చోట టైగర్​ కాగ్స్​ ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్తలతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎస్​ఎల్​బీసీ టన్నెల్​ ప్రమాద తీవ్రత : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం మార్గంలో ప్రమాదవశాత్తు చిక్కుకుని జాడ తెలియని ఏడుగురిని అత్యంత క్లిష్టతరమైన పరిస్థితుల నడుమ సహాయక బృందాలు వెతుకుతున్నాయి. వారి కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. దేశంలో ఎన్నో సొరంగాల్లో ప్రమాదాలు జరిగిన ఈ తరహా ప్రమాదం ఎక్కడా జరగలేదని నిపుణులు అంటున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. దాదాపు అన్ని సొరంగాలకు ఆడిట్లు, అవుట్​ లెట్లు సహా వివిధ మార్గాల ద్వారా సొరంగంలోకి గాలి, వెలుతురు, ఆక్సిజన్​ అందుతాయి. కానీ ఇక్కడ అందుకు భిన్నం ఒకేటే మార్గం ఉంటుంది. వెళ్లాలన్నా , రావాలన్నా అదే మార్గం వెంటిలేషన్​ ట్యూబ్​తో మాత్రమే ఆక్సిజన్​ అందుతుంది.

Category

🗞
News

Recommended