• yesterday
 విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ ఈ ఇద్దరూ కలిసి టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించారు. ఈ రోకో కాంబినేషనల్ లోనే మనం 2024 టీ20 వరల్డ్ కప్పు కొట్టాం. 2011లో వరల్డ్ కప్పు గెలుచుకున్న టీమ్ లో విరాట్ కొహ్లీ ఉన్నాడు కానీ రోహిత్ శర్మ లేడు. సో రోహిత్ శర్మకు వన్డేల్లో ఓ ఐసీసీ టోర్నీ గెలవాలి అనేది ఓ కల. పైగా ఇప్పుడు ఆయన కెప్టెన్. సో 2023 వరల్డ్ కప్ మనదే అనుకున్నాం కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా దెబ్బేసింది. వరల్డ్ కప్పు ఎలాగో తీరలేదు కనీసం కెప్టెన్ గా మినీ వరల్డ్ కప్పు కలైనా తీర్చుకుందాం అనుకుంటున్నాడు రోహిత్ శర్మ. ఈ ఇద్దరూ కలిసి 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమ్ లో ఉన్నారు కానీ ఇప్పుడు రోహిత్ నేతృత్వంలోనే ఫైనల్ జరుగుతోంది కాబట్టి  కచ్చితంగా టీమిండియాకు నాయకుడిగా ఓ ఐసీసీ కప్పు అందించాలని హిట్ మ్యాన్ భావిస్తున్నాడు. పైగా ఇప్పుడు రిటైర్మెంట్ల గోల ఒకటి నడుస్తోంది. 2024 టీ20 వరల్డ్ కప్ గెలవగానే రోహిత్, కొహ్లీ, జడేజా టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించేశారు. కొత్త తరానికి అవకాశం ఇవ్వటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ న్యూజిలాండ్ మీద ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గెలిస్తే వన్డేలకు రోహిత్ , కొహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే శుభ్ మన్ గిల్ మాత్రం తమ డ్రెస్సింగ్ రూమ్ లో రిటైర్మెంట్ అనే మాటే రాలేదని చెబుతున్నాడు. సో ప్రచారం జరుగుతున్నట్లుగా  మినీ వరల్డ్ కప్ ను ముద్దాడి యోధులు నిష్క్రమిస్తారా లేదా రెట్టించిన ఉత్సాహం తో 2027 వరల్డ్ కప్ వరకూ ఆడతారా చూడాలి. ఫిట్నెస్ పరంగా రోహిత్ కు డిబేట్ నడుస్తున్నా కొహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో చూపిస్తున్న జోష్ చూస్తుంటే మరో రెండేళ్లు ఈజీగా వన్డేలు ఆడేయగలడు అనిపిస్తోంది. మరి ఈ మోడ్రన్ డే లెజెండ్స్ కప్ గెలిపిస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Category

🗞
News

Recommended