Vemireddy Prabhakar Reddy still in dilemma to decide his political platform whether it is TDP or YSRCP
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో 'వీపీఆర్' చుట్టూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొన్నటిదాకా వైసీపీ వెంట నడిచిన ఆయన.. పార్టీ తనకు రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంతో దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో అటు టీడీపీ ఆయనకు గాలం వేసే పనిలో పడింది. నెల్లూరు లోక్ సభ టికెట్ ఇస్తామని హామి ఇచ్చింది. అయినా సరే.. ఆయన మాత్రం ఎటూ తేల్చుకోలేకపోయారు. ఓసారి టీడీపీలో చేరేందుకు సిద్దపడినా.. అనుకోని కారణాల రీత్యా అది కాస్త వాయిదా పడింది.
ఇన్నాళ్లకు మళ్లీ వైసీపీ నేతలు వీపీఆర్ ను బుజ్జగించడానికి రంగంలోకి దిగారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆయనతో మంతనాలు జరుపుతున్నారు. మునుపటిలా కాకుండా ఈసారి కచ్చితంగా రాజ్యసభ సీటు వచ్చేలా చేస్తామని, అవసరమైతే లోక్ సభ సీటైనా ఇస్తామని ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీపీఆర్ ఏ పార్టీలో చేరడానికి మొగ్గుచూపుతారన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(వీపీఆర్) వైసీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ సత్తా చాటడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జిల్లా నేతలను సమన్వయం చేసి పార్టీని జనంలోకి తీసుకెళ్లడంలో చొరవ చూపించారు. అలాగే నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లోను కీలకంగా వ్యవహరించి వైసీపీ నుంచి పలువురిని కార్పోరేటర్లుగా గెలిపించుకోగలిగారు. అయితే ఆయనకు ఇస్తానన్న రాజ్యసభ సీటు ఇవ్వడంలో జగన్ విఫలమయ్యారు. ఆయనకు ఇస్తానన్న సీటును విజయసాయిరెడ్డికి కట్టబెట్టడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు.

Category
🗞
News