• 8 years ago
No disagreements between JC Diwakar Reddy family and Paritala Ravi family said Former Anantapur ZP Chairman Chaman. A Telugu Channel interviewed him recently.



టిడిపి నేత మాజీ మంత్రి పరిటాల రవి హత్య జరిగిన వెంటనే తనకు ఆ విషయం తెలిసిందని, శత్రువులు తమపై దాడికి వ్యూహం పన్నుతున్నారని తాము అనుమానించామని, ఆ అనుమానాలు నిజమయ్యాయని అనంతపురం మాజీ జడ్పీ చైర్మెన్ చమన్ చెప్పారు.మూడు మాసాల ముందే రవి తనను బయటకు పంపాడని ఆయన గుర్తు చేసుకొన్నారు.ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చమన్ పలు విషయాలను వెల్లడించారు. పరిటాల రవి రాజకీయ జీవితం, పరిటాల శ్రీరాములయ్య, పరిటాల హరి హత్యలతో పాటు అనంతపురం జిల్లా రాజకీయాల గురించి ప్రస్తావించారు.

మంత్రిగా ఉన్న కాలంలోనే పరిటాల రవి ఫ్యాక్షన్ అంతం కావాలని కోరుకొన్నారని చమన్ గుర్తు చేశారు.2004 తర్వాత కూడ ఫ్యాక్షన్ అంతం కోసం పోరాటం చేయాలని రవి భావించాడని చమన్ గుర్తు చేసుకొన్నారు. అయితే ఆ సమయంలోనే పరిటాల రవి హత్యకు గురయ్యాడని చమన్ చెప్పారు. పరిటాల రవి కుటుంబంలో అందరూ కూడ మొండి ధైర్యం ఉన్నవారని చెప్పారు. పరిటాల శ్రీరాములయ్యతో సహ అందరు కూడ శత్రువులు దాడి చేస్తారని తెలిసి కూడ గుండె ధైర్యంతో వెళ్ళినవారేనని ఆయన చెప్పారు. శత్రువులు పొంచి ఉన్నారని తెలిసి శ్రీరాములయ్య వెళ్ళి హత్యకు గురయ్యారన్నారు. పోలీసులు ఉన్నారని తెలిసి పరిటాల హరి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడన్నారు. శత్రువులు దాడి చేస్తారని తెలిసి పరిటాల రవి ధైర్యంగా నిలబడ్డాడని చమన్ చెప్పారు.

Category

🗞
News

Recommended