• 7 years ago
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu reachs New Delhi, to meet opposition leaders.

టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన వివిధ పార్టీల నేతలను కలుసుకొని ధన్యవాదాలు తెలిపేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్, రామ్మోహన్ నాయుడు, అవంతి శ్రీనివాస్ తదితరులు మంగళవారం అన్నారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
ఏపీ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నేతలను తప్ప అవిశ్వాసానికి మద్దతు తెలిపిన వివిధ పార్టీ ఫ్లోర్ లీడర్లతో, నేతలతో చంద్రబాబు భేటీ అవుతారని, వారికి ధన్యవాదాలు తెలుపుతారని చెప్పారు.
ఏపీ హక్కులను సాధించుకునే క్రమంలో కేంద్రం వైఖరిని ఎండగట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని మరో ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. సోమవారం రాత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారని, ఈ రోజు పార్లమెంటులో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఆయన కలుస్తారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన ఏ ఒక్క నాయకుడితో ఆయన భేటీ కాబోరని తెలిపారు. ఈ రెండు పార్టీలను మినహాయించి ఇతర అన్ని పార్టీల నేతలో బాబు సమావేశమవుతారన్నారు.
ఈ సందర్భగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని ఏ విధంగా వంచించాయో చంద్రబాబు వివరించనున్నారని గల్లా జయదేవ్ తెలిపారు. రాష్ట్ర విభజన ఎలా జరిగింది, 2014 ఎన్నికల తర్వాత విభజన హామీలకు బీజేపీ ఎలా తూట్లు పొడిచిందో తెలియజేస్తారని చెప్పారు. ఫెడరల్ వ్యవస్థను కేంద్రం ఎలా నాశనం చేస్తోందో చర్చించనున్నారన్నారు.

Category

🗞
News

Recommended