‘టాప్’ లేపిన దర్శకుడితో బాలయ్య..!

  • 7 years ago
SV Krishna Reddy who made the sequel to the film Yamaleela failed to catch up the success. The senior director is now planning to team up with the senior hero Balakrishna for his next.

గౌతమి పుత్ర శాతకర్థి తర్వాత బాలకృష్ణ సినిమాల వేగం పెంచాడు. పైసా వసూల్‌తో దూసుకొచ్చిన బాలయ్య.. జై సింహాను కూడా పూర్తి చేశాడు. ఇక తదుపరి చిత్రాలపై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం పలు దర్శకులు చెబుతున్న కథలు వింటున్న బాలయ్య ఓ సెన్సేషన్ స్టోరికి ఓకే చెప్పారట.ఆ చిత్రానికి సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ బాధ్యతలు చేపట్టనున్నారనేది తాజా సమాచారం.
టాలీవుడ్‌కు పలు సక్సెస్‌లను అందించిన ఎస్వీ కృష్ణారెడ్డి ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఆ మధ్యలో యమలీలకు సీక్వెల్‌ అందించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్లా పడటంతో చాలా జాగ్రత్త వహించాడు. ఇప్పుడు సరికొత్తగా కృష్ణారెడ్డి చెప్పిన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
బాలకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి కలిసి పనిచేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో వీరి కాంబినేషన్‌లో టాప్ హీరో అనే చిత్రం వచ్చింది. కానీ అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. తాజాగా కుదిరిన వీరి రేర్ కాంబినేషన్‌ సినీ వర్గాల్లో జోష్ పెంచాయి.

Category

🗞
News

Recommended