• 7 years ago
Actor Sumanth latesh movie Malli Rava movie released today. Akanksha Singh is the female lead who is making her debut with the movie.

సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న హీరో సుమంత్.... హిట్ అందుకుని చాలా కాలం అయింది. 2011లో వచ్చిన 'గోల్కొండ హైస్కూల్' తర్వాత సుమంత్ ఖాతాలో చెప్పుకోదగ్గ సినిమా పడలేదు. కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా కేవలం మల్టీ‌ప్లెక్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సబ్జెక్టులను మాత్రమే ఎంచుకుంటున్న ఈ అక్కినేని ఫ్యామిలీ స్టార్... ఈ సారి 'మళ్లీ రావా' అనే ప్రేమ కథా చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ సినిమా విశేషాలు ఏమిటో రివ్యూలో చూద్దాం....
రాజోలులో పెరిగిన కార్తీక్ (సుమంత్) 9వ తరగతిలోనే తన క్లాసులో కొత్తగా చేరిన అంజలి (ఆకాంక్ష సింగ్)పై ఇష్టం పెంచుకుంటాడు. అంజలికి కూడా కార్తిక్ అంటే చాలా ఇష్టం. వీరి విషయం స్కూల్లో ప్రిన్సిపల్‌కు తెలియడంతో ఇద్దరి పేరెంట్స్‌ను పిలిపించి మందలిస్తాడు. ఆ తర్వాత అంజలి ఫ్యామిలీ రాజోలు నుండి ముంబై వెళ్లి పోతారు. ఆ తర్వాత అంజలి అమెరికాలో సెటిలవుతుంది. చదువులో పెద్దగా టాలెంట్ లేని కార్తీక్ ఫ్రెండ్ సహాయంతో హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. లైఫ్ అలా సాగిపోతుండగా ఓసారి అనుకోకుండా కార్తీక్ పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఆఫీసుకు అంజలి ఓ ప్రాజెక్ట్ పనిమీద వస్తుంది. చాలా కాలం తర్వాత కలిసిన ఇద్దరూ ప్రేమలో పడతారు. అమెరికా వెళ్లే లోపే కార్తీక్ ను పెళ్లాడి అతడిని డిపెండెంట్ వీసా మీద అమెరికా తీసుకెళ్లి అక్కడే సెటిలవ్వాలనుకుంటుంది అంజలి. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లికి అంతా సిద్ధమైన తర్వాత చివరి నిమిషంలో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి అమెరికా వెళ్లి పోతుంది. కార్తీక్ అంటే ఎంతో ఇష్టపడే అంజలి ఎందుకు అలా చేసింది? ఈ ప్రేమకథా చిత్రం చివరకు ఎలా సుఖాంతం అయింది అనేది తెరపై చూడాల్సిందే.

Recommended