• 6 years ago
Jai Simha, Nandamuri Balakrishna's 102nd movie was released as a Sankranti festive treat to Balayya fans. On Monday producers held a success meet in Hyd.

తెరపై తన డైలాగ్స్‌తో సింహంలా గర్జించే నటసింహం నందమూరి బాలకృష్ణ.. వేదికల మీద మాత్రం కాస్త తటపటాయించడం చూస్తూనే ఉంటాం. అలాగే తోచిందేదో మాట్లాడేసి కొన్నిసార్లు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు.
సరే, ఇదంతా పక్కనపెడితే బాలకృష్ణ చేసిన తాజా వ్యాఖ్యలపై మాత్రం ఆయన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇది మా హీరో గొప్పతనం అని ప్రశంసిస్తున్నారు..
సోమవారం 'జైసింహా' సక్సెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా బాలయ్య మాట్లాడారు. సినిమాల్లో సాధారణంగా హీరోల పక్కన.. వాళ్ల కన్నా ఎత్తున్నవారిని పెట్టరు. కానీ బాలయ్య మాత్రం అలాంటి భేషజాలేమి అక్కర్లేదని చెప్పారట. తన కంటే ఎత్తు ఉన్నంత మాత్రాన వాళ్లను సినిమాలో పెట్టుకోకూడదా? అని ఆలోచించారట.
మాటల మధ్యల 'నరసింహనాయుడు' టైమ్ లో జరిగిన ఓ సంఘటనను కూడా గుర్తుచేసుకున్నారు బాలయ్య. ఆ సమయంలో సినిమాలో గెటప్ కోసం ఎవరో ఆఫీసుకు వచ్చారట. కానీ వచ్చిన వ్యక్తి బాలయ్య కన్నా ఎక్కువ ఎత్తు ఉండటంతో తిప్పి పంపించేశారట.
ఆ వ్యక్తిని తిప్పి పంపించేశారన్న విషయం బాలయ్యకు తెలియడంతో.. 'కళామతల్లి'ని నమ్ముకుని వచ్చినవాళ్లను అలా పంపించవద్దని చిత్ర యూనిట్ కు నచ్చజెప్పారట.
జైసింహా సినిమా విషయంలోనూ నటీనటుల ఎంపిక వద్ద 'ఎత్తు' ప్రస్తావన వచ్చిందట. అందుకే బాలయ్య దానిపై మాట్లాడారు. 'సినిమాలో నా స్నేహితులుగా నటించిన విజయ్ కూడా నాకంటే పొడవే. అందరి పొడవాటి వ్యక్తుల మధ్య ఓ పొట్టోడిని నేను. సినిమాల్లో పాత్రలు ముఖ్యమంతే. మిగతా వాటిని పట్టించుకోకూడదు' అని అన్నారు.

Recommended