బాబుకు రాజమౌళి థ్యాంక్స్ : టవర్‌ ఆకృతి కి ఎక్కువ వోట్లు !

  • 7 years ago
Andhra Pradesh government has almost finalised its designs for the Assembly building at the upcoming capital of Amaravati.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం అమరావతిలో పలు భవంతుల నమూనాలపై రాజమౌళి తన అభిప్రాయాలను ఏపీ ప్రభుత్వానికి వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, గురువారం ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబునాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇచ్చిన ఓ ఐడియాకు చంద్రబాబు ఓకే చెప్పారని పేర్కొంటూ ఓ వీడియోను పోస్టు చేశారు.తనకు అవకాశం ఇచ్చిన ఆయనకు కృతజ్ఞతలు పేర్కొంటూ, కొత్త అవకాశాలను వెతికే క్రమంలో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయని అన్నారు. అసెంబ్లీ భవనంలో తెలుగుతల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న తన ఆలోచనకు చంద్రబాబు అంగీకారం తెలిపారని పేర్కొంటూ ఓ గ్రాఫిక్ వీడియోను పోస్టు చేశారు రాజమౌళి.
రాజధాని ఆకృతులకు నేను మూడుదశల్లో సలహాలు, సూచనలు అందజేశాను. తెలుగువారికి గర్వకారణంగా, నిరుపమానంగా, దిగ్గజ భవనంలా, భారతీయత ఉట్టిపడేలా, సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని సీఎం చెప్పడంతో నేను ఒక అధికారిక డాక్యుమెంట్‌ తయారుచేశాను. నాకు అందించిన చిత్రాల్లో తెలుగువారికి ఇంత గర్వపడే గొప్ప చరిత్ర ఉందా? అని సందర్శకులు ఆశ్చర్యపడేలా కొన్నింటిని ఎంపిక చేశాం. శాసనసభకు టవర్‌ ఆకృతిని ఎంపిక చేస్తే, ఈ చిత్రాలను మీడియా లేదా కల్చరల్‌ సిటీల్లో నిర్మించే భవనాలకు వినియోగిస్తారని అనుకుంటున్నాను. టవర్‌ ఆకృతికి నేను ఇచ్చిన సలహాలేమీ లేవు.' అని రాజమౌళి వివరించారు.

Category

🗞
News

Recommended