పిచ్చి పిచ్చి భాష మాట్లాడకండి...ఇవి చంద్రబాబు నేరిపిస్తున్నాడా ?

  • 6 years ago
Tollywood Director and Producer Tammareddy Bharadwaj responded on TDP MLC Rajendra Prasad and Special Representative of AP Government

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు అనుసరిస్తున్న వైఖరిపై ప్రముఖ సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరువకముందే ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని తమ్మారెడ్డి భరద్వాజ 'నా ఆలోచన'లో ఆగ్రహం వ్యక్తం చేశారు
సినిమా వారిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదని ఆయన టీడీపీ నేతలకు హితవు పలికారు‘ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యక హోదా కోసం ఉద్యమం జరుగుతోంది. ఇప్పుడిప్పుడే వేగం పెరుగుతోంది. ఈ టైంలో నిన్న ఎమ్మెల్సీగారు ఒకరు మాట్లాడారు. నేడు ఏపీ స్పెషల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంట.. ఈయన చలసాని శ్రీనివాస్ గారిని సంబోధిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఇతను మాట్లాడే భాష చూడండి. నాలుగు సంవత్సరాల నుంచి ఒక మనిషి ఉద్యమం చేస్తుంటే ఆ మనిషి చేసేది నాటకమని ఇతను చెప్తున్నాడు. నాలుగేళ్ల నుంచి వీళ్లెవరూ చేయకుండా ఇప్పుడు సడెన్‌గా... మొదలెట్టిన వీళ్లది నాటకం అంటే ఎవరూ ఊరుకోరండి' అని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు.
చంద్రబాబునాయుడు గారికి నేను చెప్పేదేంటంటే.. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని అతని పేరు చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. నేనతని పేరు చెప్పను. అతని పేరు ఉచ్ఛరించి అతన్ని పెద్దవాణ్ని చేయడం కూడా నాకిష్టం లేదు.ఇటువంటి వాళ్లందర్నీ తీసుకొచ్చి..నిన్న పిచ్చి పిచ్చి భాషతో ఎమ్మెల్సీగారు మాట్లాడారు. ఇవాళ ఇంకొకతను.. ఇతను ఎన్ఆర్ఐ రిప్రజెంటేటివ్ అట. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కి రిప్రజెంటేటివ్ అంట. గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ అంటే ఒక హోదా కలిగిన వ్యక్తులు. దిగజారుడు మాటలు మాట్లాడుతూ.. ఉద్యమంలో ఉన్నవాళ్లను ఛండాలంగా తిడుతున్నారు' అని తమ్మారెడ్డి తెలిపారు.

Recommended