• 7 years ago
Superstar Rajinikanth in a thunderous declaration today at Chennai's Raghavendra Mandapam said loud and clear, "I am entering politics.". As per schedule, the next Tamil Nadu Assembly polls will be held in 2021.Rajinikanth said he was confident of getting people's support and represented the common man. Further advising his fans to "think good, talk good and do good".


సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగ్రేట్రంపై కొనసాగుతున్న ఎన్నో రోజుల ఉత్కంఠకు తెరపడింది. ముందుగా చెప్పిన విధంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆదివారం (డిసెంబర్ 31న) ప్రకటన చేశారు. దీంతో అభిమానుల్లో కొత్త సంవత్సరం ముందే వచ్చినట్లయింది. కానీ రాజకీయ నేతలు అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించారు. సినీ తారలు వారి రాజీకీయాల గురించి ఓసారి పరిశీలిస్తే..
దక్షిణాదిలో వచ్చే ఎన్నికల్లో సినీ గ్లామర్‌ దుమ్మురేపే విధంగా కనిపిస్తున్నది. ప్రధానంగా తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాల్లో రాజకీయాలపై సినీ ప్రభావం ఎక్కువ చూపే అవకాశం ఉంది. దీంతో 2019 ఎన్నికలు చాలా రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
ఇప్పటికే రాజకీయ క్షేత్రంలో పవన్ కల్యాణ్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ట్విట్టర్ నుంచి రాజకీయాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్యనే సుడిగాలి పర్యటనలు చేసి వచ్చాడు. జనసేన పార్టీ సైనికులను ఏకతాటిపైకి తెచ్చే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నాడు.
ఇక కన్నడ రాజకీయాల్లో కొత్తగా మరో సినీ కెరటం ఎగిసిపడేందుకు సిద్ధమైంది. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఇటీవల కర్ణాటక ప్రగ్యావంత జనతా పార్టీ పేరుతో రాజకీయ ప్రకటన చేశాడు. సినీరంగంలో తనకున్న క్రేజ్‌ను ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తున్నాడు.

Recommended