జనసేన లోకి చిరు ఫాన్స్

  • 6 years ago

జనసేన పార్టీలోకి చిరంజీవి అభిమానులు చేరుతున్నారు. ఈ నెల 9వ తేదీన చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ స్వామినాయుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చేరనున్నారు. ఆయన ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు
తాజాగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్వామినాయుడుతో పాటు కాంగ్రెస్ పార్టీకి మరికొందరు చిరంజీవి అభిమానులు రాజీనామా చేశారు. వీరంతా పవన్ కళ్యాణ్ వెంట నడవనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరంజీవి అభిమానులుగా ఉన్న చాలామంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, స్వామినాయుడు వెంట నడవనున్నారు.
ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం, పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం తెలిసిందే. పార్టీని విలీనం చేసిన తర్వాత ఆయనను అధిష్టానం రాజ్యసభకు పంపించింది. 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికినా, చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నా.. జనసేన పోటీ చేయలేదు కాబట్టి పెద్దగా చర్చ జరగలేదు. కానీ 2019లో జనసేన పోటీకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఎటువైపు ఉంటారనే చర్చ సాగింది.
ఈ నేపథ్యంలో చిరంజీవి అభిమానులు కూడా జనసేనాని వెంట నడుస్తున్నారు. జనసేనలో చేరే అంశంపై స్వామినాయుడు.. రెండు మూడు రోజుల క్రితం చిరంజీవితో చర్చించారని తెలుస్తోంది. ఈ చర్చలలో రాజకీయపరమైన నిర్ణయాన్ని చిరంజీవి ఆయనకు వదిలేశారని తెలుస్తోంది. చిరంజీవిసమ్మతించారని కూడా అంటున్నారు. దీంతో చిరంజీవి ఫ్యాన్స్ పవన్‌కు అండగా ఉండాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. చిరంజీవి మౌనంగా ఉన్నా అభిమానులు తమ్ముడి వెంట ఉంటారు.

Swami Naidu is not a new name to Chiranjeevi fans. He has been the president of Chiranjeevi fans association for a few decades. It seems he is now all set to join Pawan Kalyan’s janasena party.
#SwamiNaidu

Category

🗞
News

Recommended