• 7 years ago
A motorcycle with a broken mudguard and its partially bald rider seen in CCTV footage helped Cyberabad Police crack the case of a pregnant woman

గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ సమీపంలో జరిగిన గర్భిణీ హత్య కేసులో పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించారు. అంతకుముందు నిందితులు అమర్ కాంత్ ఝా తల్లిదండ్రులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు.. గురువారం కీలక నిందితులైన అమర్ కాంత్ ఝా, వికాస్‌లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హత్య కోణాన్ని కూలంకషంగా వివరించారు.
గతనెల 27న పింకీ(32)ని హత్య చేసిన నిందితులు.. ఎనిమిది రోజుల ముందు నుంచే దీనికి స్కెచ్ వేశారు. శవాన్ని ముక్కలు చేసేందుకు అవసరమైన గ్రానైట్‌ కట్టర్‌ను, ప్లాస్టిక్‌ సంచులను ముందుగానే కోనుగోలుచేసి ఇంట్లో దాచిపెట్టారు.పింకీని చంపేందుకు అదును కోసం ఎదురుచూస్తున్న నిందితులకు గత నెల 27వ తేదీ రాత్రి అందుకు అవకాశం చిక్కింది. ఆ రాత్రి పింకీతో ఘర్షణ పడ్డ మమత.. ఆమె చెంపపై బలంగా కొట్టింది. ఆ దెబ్బకు పింకీ కిందపడిపోవడంతో.. మమత భర్త అనిల్, కొడుకు అమర్‌కాంత్‌, పింకీ భర్త వికాస్ ఆమెపై తీవ్రంగా దాడి చేశారు. పింకీ కదలకుండా.. అనిల్‌ ఆమె కాళ్లను గట్టిగా పట్టుకోగా వికాస్‌, అమర్‌కాంత్‌లు ఎక్కడపడితే అక్కడ ఆమెను కాళ్లతో తన్నారు. దీంతో అక్కడికక్కడే పింకీ ప్రాణాలు వదిలింది.
పింకీ విగతజీవిగా మారడంతో ఆమెను బాత్రూమ్‌లో పడేశారు. తల్లిని తన ఎదుటే చంపేయడం చూసి బాలుడు బోరుమన్నాడు. దీంతో అనిల్ అతన్ని బయటకు తీసుకెళ్లగా.. శవాన్ని ఏం చేయాలన్న దానిపై అమర్‌కాంత్‌, వికాస్‌లు తర్జనభర్జన పడ్డారు. ఆఖరికి గ్రానైట్‌ కట్టర్‌తో శవాన్ని ముక్కలుగా కోసి ప్లాస్టిక్‌ సంచుల్లో మూటకట్టి ఇంట్లోనే ఉంచారు. 29వ రోజు ల్లవారుజామున 3గంటల ప్రాంతంలో మూటలను తీసుకొని అమర్‌కాంత్‌, అతడి తల్లి మమత కలిసి బైక్‌పై వెళ్లి బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలోని ఓ షాపు ఎదుట పడేసి వెళ్లిపోయారు.పింకీతో వికాస్ నాలుగైదేళ్లు సహజీవనం చేశాడు. ఆ సమయంలో బతుకుదెరువు కోసం ఇద్దరు కలిసి డెహ్రాడూన్‌, పుణే, బాగల్‌పూర్‌ లాంటి ప్రాంతాలకు వలసవెళ్లారు. అక్కడ కొంతకాలం పనిచేసి తిరిగి బిహార్‌లోని స్వగ్రామానికి వచ్చారు. గతేడాది వికాస్ పింకీని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత మమతతో వికాస్ కు వివాహేతర సంబంధం ఏర్పడటమే పింకీ హత్యకు దారితీసింది.

Category

🗞
News

Recommended