• 6 years ago
A leading news channel in telugu recently busted casting couch culture in tollywood, for this they did a string operations

ఒక్క ఛాన్స్.. ఈ అభ్యర్థనకు అక్కడ కాంప్రమైజ్ అనే అర్థాలు ఉంటాయి. వెండితెరపై వెలిగిపోవాలంటే.. చీకట్లో కాస్త నలిగిపోవాలన్న పెడర్థాలూ ఉంటాయి. అవకాశం రావాలంటే.. 'ఆ' పని చేయాల్సిందే అన్న ఒత్తిళ్లు ఉంటాయి. సినీ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా సాగుతున్న 'కాస్టింగ్ కౌచ్' వైనమిది. తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా దీనికేమి మినహాయింపు కాదని, అగ్ర దర్శకులు, ప్రముఖులు అని చెప్పుకునేవాళ్లు సైతం ఈ రాసలీలల్లో భాగస్వాములేనని తాజాగా స్టింగ్ ఆపరేషన్ లో తేలింది.
శ్రీరెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి నటులు ఇటీవలి కాలంలో టాలీవుడ్ 'కాస్టింగ్ కౌచ్'పై పెదవి విప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై లోతుగా విచారించిన సదరు చానెల్.. ఇందుకోసం స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టింది. కోఆర్డినేటర్ల ముసుగులో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకు వలపన్నుతున్న 'చాన్ ఖాన్' అనే వ్యక్తి బండారం బట్టబయలు చేసింది.
చాన్ ఖాన్ భాషలో 'కమిట్‌మెంట్'కు అర్థం.. రాత్రంతా అతనితో గడపడమే. దీనికి సంబంధించి చాన్ ఖాన్ వాట్సాప్ చాట్స్, ఆడియో సంభాషణలను చానెల్ బయటపెట్టింది.
నిన్నో కాజల్ అగర్వాల్ లాగా చేస్తా. ఫోటోలు పంపించడానికి ఎందుకు భయపడుతున్నావు. ఎందుకిన్ని ప్రశ్నలు అడుగుతున్నావు. హైదరాబాద్ కి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నా. ఎప్పుడు కలుద్దామో చెప్పు.. వంటి మాటలతో చాన్ ఖాన్ అడ్డంగా దొరికిపోయాడు.
ఇటీవలి కాలంలో ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కొంతమంది బాధితులు తమను ఆశ్రయించడంతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించామని సదరు చానెల్ ప్రకటించింది. మరింత విస్తుపోయే విషయమేంటంటే.. ఈ వ్యవహారంలో ఓ బడా నిర్మాత కొడుకు, ఓ అగ్ర దర్శకుడు కూడా ఉన్నట్టు చెబుతున్నారు.
బాధితురాలి అభ్యర్థన మేరకు సదరు బడా నిర్మాత కొడుకు వివరాలను బయటపెట్టడం లేదని చానెల్ వెల్లడించింది. దీంతో అతనెవరై ఉంటారా? అన్న ఆరా మొదలైంది.

Recommended