• 6 years ago
India will take on Australia in the final of the ICC Under 19 World Cup after the semifinalists comprising three teams from Asia were reduced to just one.

ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో ఇప్పటికే మూడుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన టీమిండియా నాలుగో వరల్డ్ కప్‌పై కన్నేసింది. టోర్నీలో భాగంగా ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు శనివారం (ఫిబ్రవరి 3)న తలపడనున్నాయి. ఫైనల్లో భారత యువ జట్టు గెలిస్తే అరుదైన రికార్డును సొంతం చేసుకుంటుంది. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో ఇప్పటవరకు ఏ జట్టు కూడా నాలుగు సార్లు విశ్వవిజేతగా అవతరించలేదు. ఫైనల్లో ఆస్ట్రేలియా గెలిచినా ఈ రికార్డుని సొంతం చేసుకుంది. అటు భారత్, ఇటు ఆస్ట్రేలియా ఇప్పటివరకు మూడు సార్లు వరల్డ్‌కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాయి. దీంతో ఎవరు గెలిస్తే వాళ్లు సరికొత్త చరిత్రను సృష్టిస్తారు. అయితే ఫైనల్లో ఫేవరేట్‌గా టీమిండియా బరిలోకి దిగుతోంది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ పృథ్వి షా (94), ఓపెనర్ మన్‌జోత్ కల్రా (86), శుభ్‌మాన్ గిల్ (63) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా 328 పరుగులు చేసింది.
ఆ తర్వాత భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా 228 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత వరుసగా పపువా న్యూ గినియా, జింబాబ్వే, బంగ్లాదేశ్, పాక్‌లపై భారత్ విజయం సాధించింది. ఈ టోర్నీలో కెప్టెన్ పృథ్వి షాతోపాటు శుభమాన్ గిల్, మన్‌జోత్ కల్రా, కమలేష్ నాగర్‌కోటి, అనుకుల్ రాయ్, ఇషాన్ పోరెల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ముఖ్యంగా శుభమాన్ గిల్ టోర్నీలో వరుసగా ఐదుసార్లు 50కిపైగా స్కోర్లు సాధించాడు. పాకిస్థాన్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు 2000, 2008, 2012లలో టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. 2000లో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో, 2008లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో, 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది.

Category

🥇
Sports

Recommended