• 7 years ago
Officer movie prerelease date fix. SriReddy deamandig PK Fans to attend event
#SriReddy
#Officer
#PKFans

ఇది వరకే పవన్ కళ్యాణ్ పై అనవసరంగా దూషణలకు దిగి విమర్శలపాలైన శ్రీరెడ్డి మరో మారు అదే పద్దతిని అవలంబించింది. అసందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులని రెచ్చగొట్టే పని పెట్టుకుంది. తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియా పోస్ట్ గమనిస్తే ఈ అభిప్రాయం కలగక మానదు.
నాగార్జున, ఆర్జీవీ కాంబోలో వస్తున్న ఆఫీసర్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు తేదీ ఖరారైంది. మే 28 న ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించబోతున్నారు. నాగార్జున అభిమానులంతా పాల్గొని వేడుకని విజయవంతం చేయాలని వర్మ కోరాడు.
ఇదే విషయాన్ని తెలియజేస్తూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులని అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. నాగార్జున అభిమానులంతా ఈ వేడుకకు హాజరు కావాలని వర్మ కోరితే, శ్రీరెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్ ఫాన్స్ అందరూ హాజరు కావాలని, పైగా ఇది డిమాండ్ అంటూ రెచ్చగొట్టింది.
ఓ వర్గం మీడియాని పవన్ కళ్యాణ్ తాన్ ట్వీట్స్ తో దుమ్ముదులిపి వదిలిపెట్టారు. అప్పటి నుంచి ఆ వర్గం మీడియా శ్రీరెడ్డిని దూరం పెట్టేసింది. దీనితో శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎంత గగ్గోలు పెట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ ట్రోల్ చేస్తుంరంటూ తరచుగా శ్రీరెడ్డి ఆరోపిస్తోంది. తాజగా శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ తో ఆమెపై విమర్శలు మరింతగా ఎక్కువవుతున్నాయి.

Recommended