• 6 years ago
Rangasthalam has collected Rs 88 crore gross at the worldwide box office in three days and earned a share of Rs 56 crore for its distributors in the first weekend.

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం బాక్సాఫీసు వద్ద కనీవినీ ఎరుగని కలెక్షన్లతో దూసుకెళుతోంది.ఈ చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.ఈ మధ్య కాలంలో తెలుగులో రాని ఒక విభిన్నమైన సినిమా కావడం, చెవుటి వాడిగా హీరో క్యారెక్టరైజేషన్, కథలోని భావోద్వేగాలు,1980ల నాటి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఇలా అన్నీ కలగలపి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతికి గురి చేస్తున్నాయి.
రామ్ చరణ్ గత చిత్రం ధృవ లైఫ్‌టైమ్‌లో రూ. 89.60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీన్ని ‘రంగస్థలం' మూవీ సోమవారం మొదటి ఆటకే అధిగమించడం ఖాయం. 4వ రోజుతో ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనా.
‘రంగస్థలం' చిత్రాన్ని దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. గ్లోబల్ థియేట్రికల్ రైట్స్ రూ. 80 కోట్లకు అమ్మినట్లు సమాచారం. 3 రోజుల్లో 88 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో షేర్ రూ. 56 కోట్లు వచ్చింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు మూడు రోజుల్లోనే 70% మేర పెట్టుబడి రికవరీ అయింది. బాక్సాఫీసు వద్ద తొలివారం పూర్తయ్యేలోపు డిస్ట్రబ్యూటర్ల ఇన్వెస్ట్‌మెంట్ పూర్తిగా తిరిగి రావడంతో పాటు లాభాల్లోకి వెళతారని అంచనా.
ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో 38.89 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. నైజాంలో రూ. 10.88 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.60 కోట్లు, వైజాగ్ ఏరియాలో 5.18 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 3.48 కోట్లు, వెస్ట్ గోదావరి 2.72 కోట్లు, కృష్ణ రూ. 3 కోట్లు, గుంటూరు రూ. 4.63 కోట్లు, నెల్లూరు రూ. 1.40 కోట్లు వసూలైటన్లు తెలుస్తోంది.

Recommended