Kareena Kapoor's item song : శృంగార భావజాలాన్ని రేకెత్తించి ఐటెం సాంగ్స్

  • 6 years ago
Shabana Azmi fires on Kareena Kapoor Khan's item song Fevicol Se. Shabana Azmi rises issues with item songs.

వెండితెరపై విచ్చలవిడిగా అందాల ఆరబోత రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. క్రియేటివిటీ పేరుతో కొంతమంది అశ్లీలతే పరమావధిగా సినిమాలు చేస్తున్నారనే వాదన ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. కాగా బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ కరీనా కపూర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దబాంగ్ 2 చిత్రంలో కరీనా పెర్ఫామ్ చేసిన ఫెవికాల్ సే ఐటెం సాంగ్ గురించి షబానా ప్రస్తావించారు. సినిమాల్లో ఐటెం సాంగ్స్ అవసరం లేకుండా అశ్లీలత కోసమే పెడుతున్నారని భగ్గు మన్నారు.

షబానా తాజగా ముంబైలో జరుగుతున్న ఎఫ్ఐసీసీఐ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన వారి మధ్య ఇండియన్ సినిమా గురించి పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.

ప్రస్తుతం వస్తున్న చిత్రాలలో, సినిమా కథ పరంగా వారం లేకున్నా ఐటెం సాంగ్స్ ని చొప్పించి అశ్లీలత ద్వారా వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారని షబానా మండి పడ్డారు.

ఆడియన్స్ లో శృంగార పరమైన భావజాలాన్ని రేకెత్తించి ఐటెం సాంగ్స్ లో విచ్చలవిడి అశ్లీలత ద్వారా క్యాష్ చేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు

Recommended