యువకులను ప్రోత్సహించాలన్నది తన అభిమతం : హరిబాబు

  • 6 years ago
Is Kambhampati Haribabu resigned for Andhra Pradesh BJP president post?


ఆంధప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎంపీ కంభంపాటి హరిబాబు తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం రాత్రి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన హరిబాబు..ఆ లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపారు.
ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాకు ఆ వివరాలను వెల్లడించారు. తాను అధ్యక్షుడిగా నాలుగేళ్లు పని చేశానని,తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లు తెలిపారు.కొత్త కమిటీ మరో మూడు నాలుగు వారాల్లో ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలిపారు.
వచ్చేది ఎన్నికల సంవత్సరమని తన లేఖలో గుర్తు చేసిన కంభంపాటి.. యువకులను ప్రోత్సహించాలన్నది తన అభిమతమని, వారికి అవకాశాల కోసమే తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. తన స్థానంలో ఓ యువకుడిని నియమించాలని కోరారు. నాలుగేళ్లపాటు తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. తన రాజీనామాను ఆమోదించాలని బీజేపీ అధిష్టానాన్ని కోరారు హరిబాబు.
కాగా, ఇంత అకస్మాత్తుగా హరిబాబు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్నది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అధ్యక్ష పదవిని ఆయన తనకు తానుగా వదులుకున్నారా? లేక అధిష్ఠానం సూచన మేరకే రాజీనామా చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.

Category

🗞
News

Recommended