కేంద్రం పై శాంతియుత ఆందోళన ఫార్ములా : వర్కౌట్ అయ్యేనా ?

  • 6 years ago
Student groups have expressed negative opinion on the peaceful fight against which has been proposed by Chandra Babu after the All Party Meeting.

సిఎం చంద్రబాబు నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో కేంద్రపై పోరాటానికి అవలంభించాల్సిన పద్దతులపై ఆ పార్టీ నేతలు తప్ప మిగిలిన పక్షాలన్నీ పెదవి విరుస్తున్నాయి. ఇకనైనా తాడో పేడో తేలుస్తారనుకుంటే చంద్రబాబులో ఇంకా నాన్చుడి ధోరణి పోలేదని, రాష్ట్ర ప్రయోజనాల కన్నా తమ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పావులు కదుపుతున్నట్లే ఉందని విద్యార్థి సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం జరిగిన అఖిలపక్షం సమావేశం తరువాత చంద్రబాబు చేసిన తీర్మానం తీరుతెన్నులు చూస్తే నొప్పించక తానొవ్వక తీరులో ఉందే తప్ప కేంద్రం మెడలు వంచే ధోరణిలో లేదని వారంటున్నారు.
అఖిలపక్షం సమావేశం తరువాత చివరగా ఏకపక్షంగా చేసిన తీర్మానంలో చంద్రబాబు ఏం తేల్చారంటే...కేంద్రంపై చేసే పోరాటం శాంతియుత పద్ధతిలో కొనసాగాలని... నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయాలని, జపాన్‌ తరహాలో అదనపు పనిగంటలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతోపాటు ఏప్రిల్‌ 2, 3 తేదీల్లో ఢిల్లీకి వెళ్లాలని, దీనికి ఒక కమిటీని నియమించాలని నిర్ణయించారు. అయితే ఎవరిని తీసుకెళ్లాలనే దానిపై స్పష్టత లేకుండానే సమావేశాన్ని ముగించారు. అయితే చంద్రబాబు చేసిన ఈ తీర్మానంపై టిడిపి, ఏవో కొన్ని అనుకూల సంఘాలు మినహా మిగిలిన పక్షాలన్నీ ప్రతికూల అభిప్రాయమే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
అయితే చంద్రబాబు చెబుతున్న ఈ శాంతియుత ఆందోళన ఫార్ములా ప్రస్తుత మన దేశ రాజకీయ పరిస్థితులని బట్టి చూస్తే ఏమాత్రమైనా వర్కవుట్ అయే పరిస్థితి ఉందా?...అంటే లేదంటున్నాయి విద్యార్థి సంఘాలు...ప్రజెంట్ పొలిటికల్ సినారియోని బట్టి, కేంద్రంలో పాలకులు వ్యవహరిస్తున్న తీరును బట్టి అది అసాధ్యమనే అంటున్నారు. జపాన్ తరహా అభివృద్ది అంటే ఓకే కాని జపాన్ తరహా ఆందోళన అంటే భారతదేశానికి ఆ పద్దతి సెట్టవుతుందా?...భారతదేశంలో ఎక్కడైనా ఇప్పటివరకు ఆ తరహా పద్దతి మన దేశంలో ఎక్కడైనా సత్పలితాన్ని ఇచ్చిందా?...అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

Category

🗞
News

Recommended