సీఎం రమేష్ రాజీనామా ? మోడీ ఫేర్‌వెల్ స్పీచ్

  • 6 years ago
All those who are retiring from the house (Rajya Sabha) today have their own significance and each of them tried their best to contribute to the glorious future of this country. I wish you success in future: PM Modi in Rajya Sabha

రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ సభలో ప్రసంగించారు. వారిని ఆయన ప్రశంసించారు. వారి భవిష్యత్తు బాగుండాలని ఆయన ఆశించారు. ప్రతి ఎంపీ కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారన్నారు. ప్రతి ఒక్కరు దేశ భవిష్యత్తు కోసం తమవంతు సహకారం అందించారన్నారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న టీడీపీ నేత సీఎం రమేష్ రాజీనామా చేశారు. ఇటీవల ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ తరఫున ఆయన ఎంపికయ్యారు.
సాంకేతిక కారణాల దృష్ట్యా ఒకే సమయంలో అటు తెలంగాణ, ఇటు ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడానికి వీల్లేదు కాబట్టి ఆయన రాజీనామా చేశారు. వాస్తవంగా ఏప్రిల్ 2 వరకు సీఎం రమేష్ పదవీ కాలం ఉంది. కానీ ఏపీ నుంచి ఎన్నికైనందున ఆయన తెలంగాణ పేరిట కొనసాగరాదని నిర్ణయించుకున్నారు. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించారని తెలుస్తోంది.
లోకసభలో బుధవారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభం కాగానే కావేరీ బోర్డును ఏర్పాటు అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనలు నిర్వహించారు.
సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ విజ్ఞప్తి చేశారు. అయినా సభ్యులు వినలేదు. సభ్యులు ఆందోళన విరమించకుంటే నిరవధిక వాయిదా వేస్తానని స్పీకర్ హెచ్చరించారు. అయినా సభ్యుల ఆందోళన తగ్గలేదు.

Recommended