Naa Peru Surya Movie Lead Into A Controversy

  • 6 years ago
Naa Peru Surya story was not for NTR. There is another story for NTR says Vakkantham Vamsi
#NaaPeruSurya
#VakkanthamVamsi
#NTR

అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. అల్లు అర్జున్ ఆర్మీ అధికారి పాత్రలో నటించిన చిత్రం ఇది. బన్నీ యాంగ్రీ సోల్జర్ గా అదరగొట్టాడని రిపోర్ట్స్ వస్తున్నాయి. నా పేరు సూర్య చిత్రంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. బన్నీ నటించిన ఈ చిత్రం పూర్తి స్థాయి దేశ భక్తి కథాంశంగా తెరకెక్కింది. రచయిత వక్కంతం వంశి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ఇదే. కాగా వంశి గతంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోలకు అదిరిపోయే కథలు అందించారు. నా పేరు సూర్య చిత్ర కథ గురించి కూడా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో వక్కంతం వంశీ క్లారిటీ ఇచ్చారు.
దర్శకుడిగా మారడం ఎన్నో ఏళ్ల కల అని, ఆ కలని అల్లు అర్జున్ నెరవేర్చడాని వక్కంతం వంశీ పలు సందర్భాల్లో అన్నారు. కథ ఎంత మందికి నచ్చినా హీరో రాజముద్ర వేయకపోతే సినిమా ముందుకు సాగదని వంశి ప్రీరిలీజ్ ఈవెంట్ లో తెలిపిన సంగతి తెలిసిందే. కానీ తన కథకు అల్లు అర్జున్ రాజ ముద్ర వేశారని అందువలనే దర్శకుడు కావాలనే తన కల సాకారం అయిందని వంశి తెలిపాడు.
నా పేరు సూర్య చిత్ర కథ మొదట ఎన్టీఆర్ కోసం వంశి రాసుకునట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వలనో, ఇతర చిత్రాలతో బిజీగా ఉండకపోవడం వలనో వంశికి ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కలేదు. దీనితో ఈ కథని అల్లు అర్జున్ దగ్గరకు తీసుకుని వెళ్లారనే ప్రచారం జరిగింది.

Recommended