Naa Peru Surya Movie Collections

  • 6 years ago
Naa Peru Surya, Naa Illu India is Telugu language action film written and directed by Vakkantam Vamsi. Produced by Shirisha and Sridhar Lagadapati under the banner Ramalakshmi Cine Creations, it stars Allu Arjun and Anu Emmanuel in the lead roles. This movie released on May 4th, 2018. In this occassion, This movie got good response all over the world. Allu Arjun's minted Rs.40 crores all over the world.
#NaaPeruSurya
#VakkantamVamsi
#AnuEmmanuel

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రం తొలి బ్రహ్మండమైన కలెక్షన్లను రాబట్టింది. కథా, మాటల రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రూపొందించిన ఈ చిత్రంపై విమర్శకులు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పవర్‌ఫుల్ ఎనర్జీతో అల్లు అర్జున్ దుమ్మురేపారు. లగడపాటి శ్రీధర్, బన్నీవాసు, నాగబాబు నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్ర కలెక్షన్లు కూడా అల్లు అర్జున్ ఎనర్జీ స్థాయిలోనే ఉండటం విశేషం.
నా పేరు సూర్య చిత్రం రిలీజ్ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ వసూళ్లు అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ ఓపెనింగ్‌గా నిలిచింది. ఈ చిత్ర కలెక్షన్లు బన్నీ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి రుజువు చేసింది అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా ట్వీట్ చేశారు.
నైజాంలో నా పేరు సూర్య మొదటి రోజున రూ.4.15 కోట్లు, సీడెడ్‌లో రూ.2.35 కోట్ల వసూళ్లతో 23.8 గ్రాస్ (16.28 కోట్లు) వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో సుమారు రూ.17 కోట్లు రాబట్టింది.
ఏపీలోని వైజాగ్‌లో రూ.2.02 కోట్లు, తూర్పు గోదావరిలో 2.07 కోట్లు, పశ్చిమ గోదావరిలో 1.54 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.05 కోట్లు, గుంటూరులో రూ.2.47 కోట్లు, నెల్లూరులో 63 లక్షలతో మొత్తంగా 9.78 కోట్లు వసూసులు చేసింది.
నా పేరు సూర్య చిత్రం దువ్వాడ జగన్నాథం కలెక్షన్లకు ధీటుగా వసూళ్లను రాబట్టింది. ఏపీ, తెలంగాణలో ప్రత్యేక ప్రదర్శనల కారణంగా భారీగా కలెక్షన్లు నమోదయ్యాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.