• 7 years ago
Katamarayudu ox . This ox also part of Sye Raa movie

కాటమరాయుడు చిత్రం అభిమానులని నిరాశపరిచినప్పటికీ ఎంట్రీ సీన్ మాత్రం అదిరిపోయింది. ఇంటిముందు ఎద్దు అదుపు తప్పి రంకెలు వేస్తున్న సమయంలో కాటమరాయుడు ఎంట్రీ ఇచ్చి ఎద్దుని శాంతిపజేస్తాడు. ఆ సన్నివేశం విజిల్స్ కొట్టించేవిధంగా ఉంటుంది.
ఈ ఎద్దుపై మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రంలో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. సైరా నరసింహారెడ్డి చిత్ర షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
ఆ ఎద్దు తాజగా మృతి చెందింది. ప్రకాశం జిల్లాకు చెందిన నవనీతాకృష్ణకు చెందినది ఈ ఎద్దు. వారంరోజులుగా అనారోగ్యంతో భాదపడుతూ మృతిచెందినట్లు అతడు తెలిపాడు.
నవనీత కృష్ణ వద్ద మృతి చెందిన ఎద్దుతో పాటు దీనికి జతగా మరో ఎద్దుకూడా ఉంది. వీటిని బ్లాక్ బ్రదర్స్ అని పిలుచుకునేవారట. ఈ రెండు ఎద్దులు ఒకే తల్లికి జన్మించాయి
ఈ ఎద్దుల జంటకు పోటీల్లో 2015 నుంచి తిరుగులేకుండా విజయం సాధిస్తున్నాయి. 10 సార్లు ప్రథమ బహుమతి, 15 సార్లు ద్వితీయ బహుమతి సాధించాయి. మృతి చెందిన ఎద్దుకు అంత్యక్రియలు కూడా నిర్వహించినట్లు తెలిపారు.

Recommended