• 8 years ago
Apparently Teja's next featuring Sr hero Venkatesh will go on floors from December 13th on the eve of the Daggubati scion's birthday. Reportedly the film is likely to be titled as "Aata Naadhe, Veta Naadhe".
చాలా కాలం గ్యాప్ తీసుకున్నాక బాబు బంగారం లాంటి గట్టి ఫ్లాప్ తో వచ్చి "గురు" తర్వాత కాస్త ఆ డామేజ్ ని కవర్ చేసుకున్నాడు వెంకీ, ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ చేస్తున్న సినిమాపై ఇన్నాళ్లు ఓ క్లారిటీ వచ్చింది. రానా తో నేనే రాజు నేనే మంత్రి చేసి కొత్తగా ఫామ్ లోకి వచ్చిన తేజ డైరక్షన్ లో వెంకటేష్ మూవీకి సర్వం సిద్ధం చేశారు. ఈ సినిమాకు టైటిల్ గా ఆటా నాదే.. వేటా నాదే అని పెడుతున్నారని తెలుస్తుంది.
టైటిల్ తో అదృష్టం లాంటి సెంటిమెంట్ ఏమైనా ఫాలో అయ్యాడేమో.. గానీ రీసెంట్ గా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసిన తేజ మరోసారి వెంకటేష్ తో అలాంటి ఓ పవర్ ఫుల్ సినిమాతోనే వస్తున్నాడట.
ఈ దర్శకుడు ఇంతకుముందు చిత్రం అనే టైటిల్ సక్సెస్ అవ్వగానే.. జయం.. నిజం.. ధైర్యం.. లాంటి టైటిల్స్ తో ఎక్కువగా కనిపించాడు. మళ్లీ ఇప్పుడు
"నేనే రాజు, నేనే మంత్రి" అని నాలుగు పదాల టైటిల్ తో హిట్ కొట్టిన సెంటిమెంట్ తోనే, తేజ ఈ సినిమాకు కూడా నాలుగు పదాల టైటిల్ ను పెట్టాడట. ఇక డిసెంబర్ 13 వెంకటేష్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది.

Recommended