గుండెపోటుతో కన్నుమూసినట్లు పుకార్లు పుట్టించింది ఆయనే || Oneindia Telugu

  • 5 years ago
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, మాజీ లోక్ సభ సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో కొత్త కోణం తాజాగా వెలుగు చూసింది. వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించినట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. హైదరాబాద్ లో నివసిస్తోన్న వివేకా కుటుంబ సభ్యులు కూడా మొదట్లో ఆయన గుండెపోటుతోనే తుదిశ్వాస విడిచి ఉంటారని నిర్ధారణకు వచ్చారు. పోలీసులు వివేకా భౌతిక కాయాన్ని చూసిన తరువాతే.. దారుణంగా హత్యకు గురైనట్లు తేలింది. వివేకా గుండెపోటుతో మరణించారనే విషయాన్ని నమ్మించడానికి ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి విశ్వప్రయత్నాలు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మొదటగా ఈ పుకారును పుట్టించింది గంగిరెడ్డేనని వారు నిర్ధారించారు.
#ysvivekanandareddy
#sit
#pulivendula
#kadapa
#ysrcp
#ycp
#elections2019
#tdp
#gangireddy

Recommended