• 5 years ago
The academic year begun in Telangana state but the lack of teachers in various schools is troubling the students. Against this backdrop, a video message made by a 4th class student to CM KCR responding to a problem in their school has now gone viral on social media.The girl who spoke in the video message is Soubhagya. A fourth-class student of a government school in a pedda Dhanwada village in Gadwal district has said that at least one teacher in his government school has not been there, and that they are in trouble to study .The student appealed CM KCR that they want to send a teacher.
#telangana
#cmkcr
#appeal
#Soubhagya
#PeddaDhanwada
#teachers

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైనా నేటికీ వివిధ పాఠశాలల్లో విద్యా బోధన చేసే ఉపాధ్యాయులు లేకపోవడం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక 4వ తరగతి విద్యార్థిని తమ పాఠశాలలోని సమస్యపై కేసీఆర్ స్పందించాలి అంటూ చేసిన వీడియో మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక వీడియో మెసేజ్ లో మాట్లాడిన బాలిక పేరు సౌభాగ్య. గద్వాల జిల్లా లోని పెద్ద ధన్వాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న సౌభాగ్య తమ గవర్నమెంట్ పాఠశాల లో కనీసం ఒక్క టీచరు కూడా పాఠాలు చెప్పడానికి లేరని, విద్యా బోధన చేసే వారు లేక తాము ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొంది , తమకు ఒక టీచర్ ను పంపించాల్సిందిగా కోరుతున్నాము అని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేసింది.

Category

🗞
News

Recommended