• 8 years ago
Depressed at being harmed by a lecturer at Narayana Junior College, Kukatpally, where she was a second-year Intermediate student, Navyasri Goud slitting her wrist in the hostel.

ఆత్మహత్యలు.. విద్యార్థులపై వేధింపులతో నారాయణ కాలేజీ నిత్యం వార్తల్లో నానుతూనే ఉంది. ఎన్ని కేసులు నమోదైనా.. ఎంత మంది ఫిర్యాదులు చేస్తున్న.. ప్రభుత్వాలు మాత్రం ఆ కాలేజీల వైపు కన్నెత్తి చూడటం లేదు.
వెరసి అమాయక విద్యార్థులు బలైపోతున్న పరిస్థితి. చదువుల ఒత్తిళ్లు తాళలేక బలైపోతున్నవారు కొందరైతే.. యాజమాన్యం, లెక్చరర్ల తీరుతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నవారు మరికొందరు. తాజాగా నారాయణ కాలేజీలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.ఖమ్మం జిల్లా కొత్తగూడెం గాంధీనగర్‌కు చెందిన విద్యార్థిని నవ్యశ్రీ గౌడ్ (16) కూకట్‌పల్లి వెంకట్రావ్‌నగర్‌ సమీపంలోని నారాయణ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది.
చదువులో చురుగ్గా ఉండే విద్యార్థినిపై ఇటీవల ఓ లెక్చరర్ కక్ష కట్టింది. చీటికి మాటికి దూషించడం, ఆఖరికి పరీక్షల్లోను ఉద్దేశపూర్వకంగా తక్కువ మార్కులు వేసి వేధించడం చేసింది. దీంతో సదరు విద్యార్థిని తీవ్ర ఒత్తిడికి లోనైంది.క్లాస్ జరుగుతున్న సమయంలో స్నేహితులతో మాట్లాడిందన్న కోపంతో నవ్యశ్రీపై మేథమెటిక్స్‌ లెక్చరర్‌ కీర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రంగా మందలించడంతో నవ్యశ్రీ నొచ్చుకుంది. ఆ తర్వాత జరిగిన పరీక్షల్లోను నవ్యశ్రీపై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించింది. కావాలనే మార్కులు తక్కువ వేసి విద్యార్థినిని ఆందోళనకు గురయ్యేలా చేసింది.

Category

🗞
News

Recommended