• 4 years ago
Gautam Adani May Dethrone RIL Chairman Mukesh Ambani As Asia's Richest Man
#GautamAdani
#MukeshAmbani

ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబానికి అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ చెక్ చెప్పే దిశగా వెళ్తోంది. ఇటీవల అదానీ గ్రూప్ సంస్థల షేర్ భారీగా ఎగిసిపడుతోంది. గౌతమ్ అదానీ దూకుడు చూస్తుంటే అంబానీని దాటేసి కార్పోరేట్ రంగంలో అపరకుబేరుడిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదానీ సంపద ఇటీవల అనూహ్యంగా పెరిగింది. ఆయన కుటుంబ సంపద 67.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మన కరెన్సీలో ఇది రూ. 5 లక్షల కోట్లు. దేశంలో రెండో అతిపెద్ద సంపన్నుడిగా గౌతమ్ అదానీ ఉన్నారు. మొదటి స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ ఆస్తి 76.3 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ.5.50 లక్షల కోట్లు. వీరి మధ్య వ్యత్యాసం పెద్దగా లేదు. గత ఏడాది ముఖేష్ అంబానీకి అదానీ దరిదాపుల్లో లేరు.

Category

🗞
News

Recommended