• 7 years ago
Kerala Chief Minister Pinarayi Vijayan on Thursday came out in support of the teaser song of ‘Oru Aadar Love” of Priya Prakash Varrier

కన్ను గీటి కోట్లాది హృదయాలను దోచుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్‌కు మద్దతుగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని మాణిక్య మలరయ పూవీ పాట విశేషంగా ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే.
ఆ పాటపై వివాదాలు కూడా చెలరేగాయి. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి స్పందించారు. ఆయన దానిపై ఫేస్‌బుక్‌లో స్పందించారు. అయితే ఆయనపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఓ సినిమా పాటకు స్పందించిన ముఖ్యమంత్రికి రాష్ట్రంలో మిగతా సమస్యలు కనిపించడం లేదా అని సీనియర్ నటుడు, రాజకీయ ఉద్యమకారుడు జాయ్ మాథ్యు ప్రశ్నించారు. మరింత ఘాటుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.
పోలీసు శాఖను తనద వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి ఓ సినిమా పాట వివాదంపై స్పందిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ మద్దతిచ్చారు. కానీ, రాజకీయ హత్యలు ఆయనకు కనిపించడం లేదనుకుంటా. కన్నూర్‌లో కొన్ని రోజుల క్రితం కాంగ్రెసు కార్యకర్లను కొందరు దారుణంగా హత్య చేశారు. వారిని ఇంత వరకు అరెస్టు చేయలేదు. అంటే హంతకులు తప్పించుకుని తిరిగే స్వేచ్ఛను విజయన్ ప్రభుత్వం ప్రసాదించిందా" అని జాయ్ మాథ్యు విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయని, అనవసరమైన విషయాలపై స్పందించడం మానేసి పనికొచ్చేపనులపై దృష్టి పెడితే మంచిదని మాథ్యూ అన్నారు. "కళలో భావ ప్రకటన స్వేచ్ఛపై అసహనాన్ని సహించేది లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారంనాడు అన్నారు.

Category

🗞
News

Recommended