• 6 years ago
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో హైలెట్ అయిన మహేష్ కత్తి.. హిందూ దేవతలపై కూడా దారుణపదజాలం వినియోగించారు. ఇష్టారీతిన మాట్లాడి భావప్రకటన స్వేచ్ఛ అంటూ ముడిపెట్టే మహేష్ కత్తిపై హైదరాబాద్ నగర పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతనిపై నగర బహిష్కరణ వేటు వేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుమతి లేకుండా నగరంలోకి ప్రవేశించవద్దని అతనికి హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల శ్రీరాముడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం ఉదయం హైదరాబాదులోని కత్తి మహేష్‌కు నోటీసులు ఇచ్చారు. నగరం విడిచి వెళ్లాలని, అనుమతి లేకుండా ప్రవేశించవద్దని చెప్పారు. అతనిని అదుపులోకి తీసుకొని ఏపీకి తరలించారు. అతని స్వస్థలం చిత్తూరు జిల్లా. పోలీసులు అక్కడకి తరలించారు.
మహేష్ కత్తి హిందూ దేవతలను విమర్శించడంపై హిందూ సంఘాలు, హిందువులు, స్వామీజీలు, నాగబాబు వంటి సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేశారు. రాముడిపై అతనిది ఉన్మాదపు భావజాలమని, అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ బోడుప్పల్ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర సంకల్పించారు. చర్యలు తీసుకోకుంటే యాదాద్రిలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేశారు.

Hyderabad City police on Monday controversial Mahesh Kathi from city. Mahesh Kathi is targetting Hindu gods and Pawan Kalyan.
#MaheshKathi

Category

🗞
News

Recommended