జంట నగరాల్లో భారీ వర్షం

etvbharat

by etvbharat

337 views
Heavy Rain in Hyderabad and Secunderabad : అధిక ఉష్ణోగ్రత ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగరవాసులకు వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్, సికింద్రాబాద్​ జంట నగరాల్లో వాతావరణం చల్లబడింది. ఈ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బోయిన్​పల్లి, తిరుమలగిరి, అల్వాల్​, మారేడుపల్లి, చిలకలగూడ, పారడైజ్​, బేగంపేట, కవాడిగూడ, బాగ్​లింగంపల్లి, జవహర్​నగర్​, ఖైరతాబాద్​, ఎర్రమంజిల్​, పంజాగుట్ట, బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​, బోరబండ, అమీర్​పేట, యూసఫ్​గూడ, ముషీరాబాద్​, చిక్కడపల్లి, గాంధీనగర్​, దోమలగూడ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

అలాగే ఆర్టీసీ క్రాస్​ రోడ్, భోలక్​పూర్​, నారాయణగూడ, హిమాయత్​నగర్​, కోఠి, అబిడ్స్​, నాంపల్లి, బషీర్​బాగ్​, చాదర్​ఘాట్​, మలక్​పేట్​, సైదాబాద్​, చంపాపేట్​, లక్డీకపూల్​, హిమాయత్​నగర్​, మేడ్చల్​, కండ్లకోయ, దుండిగల్​, గండిమైసమ్మ ప్రాంతాల్లో వర్షం పడింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రహదారులు అన్నీ జలమయమయ్యాయి. రహదారులు, కాలనీల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ప్రజానికం ఇబ్బంది పడ్డారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్​లో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం నీరు మొత్తం రోడ్లపై పారుతుండడంతో ఎక్కడ ఏ మ్యాన్​హోల్​ ఉందోనని జనం భయం గుప్పిట్లో ఉన్నారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.