ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారదా

  • 2 days ago
CM and Ministers Photos in AP : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి దాదాపు నెల కావొస్తుంది. సీఎం సహా మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తై వారాలు గడిచాయి. ఐనా కొందరు ప్రభుత్వ విభాగాధిపతులకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. ప్రభుత్వ వెబ్‌సైట్లు, యాప్‌లలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రుల ఫొటోలను వెంటనే అప్‌లోడ్ చేయాల్సి ఉండగా ఇప్పటికీ వాటిని పొందుపరచలేదు. కొందరు వైఎస్సార్సీపీ భక్త అధికారులు తీరుమార్చుకోక పోగా మరికొందరు నిర్లక్ష్యంతో వాటిపైన దృష్టి పెట్టడం లేదు.