• last month
AP CM Brother Ramamurthy Naidu Died Today : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. గురువారం ఆయనకు హార్ట్ అటాక్ రావడంతో ప్రాధమిక చికిత్స అనంతరం హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. సోదరుడి మరణవార్త తెలియడంతో మహారాష్ట్ర పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ అంతకుముందే​ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్​కు వచ్చారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ 12.45 గంటలకు చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సాయంత్రం ప్రత్యేక విమానంలో రామ్మూర్తినాయుడు పార్ధివదేహాన్ని రేణుగుంట తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో నారావారిపల్లెకు తీసుకెళ్లనున్నారు. రామ్మూర్తి నాయుడుకు నివాళులు అర్పించేందుకు బాలకృష్ణ, నందమూరి కుటుంబసభ్యులు, తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆసుపత్రికి తరలివచ్చారు.

Category

🗞
News

Recommended