డీఎస్సీ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ధర్నా - విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి ప్రయత్నం

  • 21 days ago
DSC Protest In Hyderabad : డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు హైదరాబాద్‌లో ఆందోళనకు దిగారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీలా వెంకటేశ్ ఆధ్వర్యంలో లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. డీఎడ్, బీఎడ్, నిరుద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా డీఎస్సీ కోసం సన్నద్ధం అవుతున్నట్లు తెలిపారు. అయితే ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, డీఏఓ, టెట్‌ పరీక్షలను రాయడం జరిగిందని, వెంటనే డీఎస్సీ పరీక్ష ఉంటే దానికి సన్నద్ధం అవ్వడానికి సరైన సమయం లేదని వివరించారు.

Recommended