లైంగిక వేధింపుల ఆరోపణలు - జానీ మాస్టర్​కు తెలుగు ఫిలిం ఛాంబర్ షాక్

  • 2 days ago
Jani Master Controversy : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ ఉదంతంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా, టాలీవుడ్‌లోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ కూడా తీవ్రంగా స్పందించింది. కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి జానీ మాస్టర్‌ను తాత్కాలికంగా తప్పించాలని సిఫారసు చేసిన కమిటీ, పని ప్రదేశాల్లో మహిళలకు చలన చిత్ర పరిశ్రమ ధైర్యాన్ని ఇవ్వలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమలో మహిళలు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కమిటీ స్పష్టం చేసింది..

Category

🗞
News

Recommended