సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకునేది లేదు : పవన్

  • 2 days ago
Pawan Kalyan Prayaschitta Diksha: తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను పవన్‌ కల్యాణ్‌ శుభ్రం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Category

🗞
News

Recommended