• 2 months ago
TDP Leaders Participated in Palle Panduga Program Across State : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెంలో మంత్రి కొలుసు పార్థసారథి పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి పార్థసారథికి గిరిజనులు బంజారా నృత్యం చేస్తూ వినూత్నంగా స్వాగతం పలికారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లెలో 8 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి అధికారులతో కలసి టీడీపీ నాయకులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

Category

🗞
News
Transcript
00:00🎵Outro Music🎵
00:30🎵Outro Music Continues🎵
01:00🎵Outro Music Fades🎵

Recommended