ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తనపై చేసిన విమర్శలకు ప్రజలే సరైన సమాధానమిచ్చారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. ముఖ్యమంత్రి విమర్శలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు. ప్రజాతీర్పు కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టులాంటిదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Category
🗞
News