బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా పడిన ఘటన మహారాష్ట్రలోని లాతూర్-నాందేడ్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 36 మందికి తీవ్ర గాయాలు కాగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు. హైవేపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి.