• 2 days ago
Tiger Spotted in Crop Field : జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండల కేంద్రం శివారులోని పెద్దపులి కలకలం రేపింది. గ్రామంలోని బొక్కి చెరువు ముందు పంచరాయి అనే ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఓ మహిళా రైతు పంట చేలో పని చేస్తుండగా దూరంగా గట్టు మీద పులి నడుస్తూ కనిపించింది. దీన్ని సెల్​ఫోన్​లో వీడియో తీసిన సదరు రైతు. బుధవారం ఆ గ్రామానికి చెందిన ఓ రైతు వెళ్లి ప్రాంతాన్ని పరిశీలించగా పెద్దపెద్ద అడుగులు కనిపించినట్లు తెలిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కొత్తపల్లిగోరిలో పులి తిరుగుతున్నట్లు బుధవారం గ్రామస్థులు తెలిపారు. ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తామని అటవీశాఖ అధికారి తెలిపారు.

Category

🗞
News
Transcript
01:00You

Recommended