Skip to playerSkip to main contentSkip to footer
  • 12/6/2017
Watch Rowdy Sheeter lost life in Vijayawada today.

విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలో గల మాచవరం లో ప్రత్యర్ధులు సుబ్రహ్మణ్యం అనే రౌడీ షీటర్ ని అత్యంత దారుణంగా నరికి చంపారు. తెనాలి కి చెందిన రౌడీషీటర్ వేమూరి సుబ్బు అలియాస్ కాళిదాసు సుబ్రహ్మణ్యం ని ప్రత్యర్థులు పట్టపగలే దారుణంగా నరికారు. ఈ ఘటనతో విజయవాడ ప్రాంతం లో అలజడి చెలరేగింది. పట్టపగలే దారుణ ఘటన జరగటం తో ఆప్రాంతం లో టెన్షన్ వాతావరణం అలుముకుంది. ప్రత్యర్ధులు కొన్ని సంవత్సరాలుగా సుబ్రహ్మణ్యం హత్యకు పధకం వేస్తున్నారు అని తెలిసింది. పట్టణానికి చెందిన వైసీపీ యువజన నాయకుడు మేడిశెట్టి కృష్ణ హత్య కేసులో సుబ్బు ప్రధాన నిందితుడు. అయితే ఈకేసులో కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు సుబ్రహ్మణ్యం. ఆ సమయం లో ఆవేశం ఆపుకోలేని ప్రత్యర్ధులు సుబ్రహ్మణ్యం అన్న సత్యం ని అయ్యప్ప మాలలో ఉన్నా వదలకుండా కసిగా నరికి చంపారు. ఇన్నాళ్ల తరువాత సుబ్రహ్మణ్యం వీరి కంట బడ్డాడు.గత వారం రోజుల క్రితం ఓ కేస్ లో తెనాలి కోర్ట్ కు కూడా సుబ్రహ్మణ్యం హాజరయ్యాడు. నేటి ఉదయం విజయవాడ మాచవరం వద్ద ప్రత్యర్ధులు పధకం ప్రకారం వేట కొడవళ్ళతో నరికి చంపారు.

Category

🗞
News

Recommended