Fire Accident At Nacharam : నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు భారీ ఎత్తున ఎగిసి పడ్డాయి. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. సుమారు మూడు గంటల నుంచి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. గోదాంలో ప్లాస్టిక్కు మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. గోదాంలో ఎలాంటి నేమ్ బోర్డ్ లేకుండా యాజమాన్యం కంపెనీని నడిపిస్తోంది. ఇదే కంపెనీలో గతంలో కూడా ఒకసారి అగ్ని ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు.
Category
🗞
News