Skip to playerSkip to main contentSkip to footer
  • today
ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఏదీ కలిసి రాలేదు. సీజన్ మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ పై గెలవటం..మధ్యలో లక్నో సూపర్ జెయింట్స్ పై మరో విజయం సాధించటం తప్ప అత్యంత ఘోరమైన ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ ఓ చేదు సీజన్ ను రుచి చూసింది  ఈసారి. కెప్టెన్ మారినా రుతురాజ్ నుంచి ధోని జట్టు పగ్గాలు చేపట్టినా తల రాత మారలేదు. ఆడిన 10 మ్యాచుల్లో 8ఓటములతో కేవలం రెండే విజయాలతో నాలుగు పాయింట్లే సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ నిన్న పంజాబ్ కింగ్స్ తో పరాజయం తర్వాత ఈ ఐపీఎల్ సీజన్ నుంచి అఫీషియల్ గా ఎలిమినేట్ అయ్యింది. ఇక మిగిలిన నాలుగు మ్యాచులు గెలిచినా కూడా మిగిలిన టీమ్స్ పాయింట్లన ప్రభావితం చేయటం తప్ప ప్లేఆఫ్స్ కు చేరే అవకాశం లేకపోవటంతో చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేషన్ తప్పనిసరి అయ్యింది. ఐపీఎల్ చరిత్రలో ఈ సీజన్ తో కలిపి ఇప్పటివరకూ 18 సీజన్లు జరిగితే..అందులో 10 సీజన్లలో ఫైనల్ ఆడిన ఘనమైన చరిత్ర సీఎస్కే కు ఉంది. అలాంటిది వరుసగా రెండో సీజన్ లో సీఎస్కే జట్టు ప్లే ఆఫ్ అవకాశాన్ని కోల్పోయింది. ఇలా వరుసగా రెండు సీజన్స్ ప్లే ఆఫ్స్ ఆడకపోవటం చెన్నైకు ఇదే తొలిసారి. గతంలో ఓ సీజన్ చేదు అనుభవం ఎదురైనా వెంటనే ఆ తర్వాత సీజన్ ఫైనల్ కి వెళ్లటం చెన్నైకి అలవాటు. అలాంటిది వాళ్ల చరిత్రలోనే తొలిసారిగా రెండు సీజన్లు ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయారు. జట్టంతా సమష్ఠిగా విఫలమవటం...రుతురాజ్, ధోనీలు కెప్టెన్ గా ఫెయిలవటం..నాణ్యమైన ఆటగాళ్లలో నూ సమన్వయం లోపించటం...ఆటగాళ్లలో విజయం కోసం కసి కనిపించకపోవటం ఈసారి చెన్నై జట్టు ఓటములకు కారణాలుగా విశ్లేషించవచ్చు. సీజన్ చివరికి వచ్చేసారి కుర్రాళ్లతోనే ప్రయోగాలు చేసే అవకాశం ఉంది కాబట్టి మిగిలిన నాలుగు మ్యాచుల్లో ప్రయోగాల ఆధారంగా వచ్చే సీజన్ కు ఓ సరికొత్త కుర్ర జట్టుతో చెన్నై బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Category

🗞
News

Recommended